Header Banner

అమ్మ బాబోయ్.. తిరుమలలో కొత్త తరహా మోసం.. తస్మాత్ జాగ్రత్త! టీటీడీ విజిలెన్స్ విభాగంలో..

  Fri May 02, 2025 21:26        Politics

తిరుమలలో భక్తులను బురిడీ కొట్టించిన మాయగాడి లీలలు బయటకొచ్చాయి. తమిళనాడులోని మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు గత కొద్ది రోజులుగా కొండపై మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్‌ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు.. తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళా భక్తులను మాంగళ్య పూజతో మోసం చేసినట్లు తేల్చారు. టీటీడీ ఉద్యోగిని అంటూ తిరుమల ఆలయ పరిసరాల్లోనే తిరుగుతూ భక్తులకు మాయ మాటలతో నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని ఆలయం ముందు మాంగళ్య పూజ చేయాలని మాయమాటలతో మురుగన్ నాగరాజ్ వారిని మోసగించాడు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అఖిలాండం వద్ద ఉన్న తమిళనాడు తిరువన్నామలై ప్రాంతానికి చెందిన ఉచిమహాలీ అనే మహిళతో తొలుత మాటలు కలిపాడు. తర్వాత తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకొన్నాడు. తిరుమల వైభవాన్ని చెబుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాంగళ్య పూజ చేస్తే భర్తకు, కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మబలికాడు.

 

ఇది కూడా చదవండి: ఆ విషయంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేదు.. మోడీ ప్రశంస! ఏపీలో కనెక్టివిటీ పరంగా..

        

అనంతరం బీడీ ఆంజనేయస్వామి ఆలయ లోని మినీ షాపింగ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి ఆమెకు రెండు డజన్ల మట్టిగాజులు ఇచ్చి ఆమె వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు మాంగళ్య సూత్రం, లక్ష్మీ డాలర్ చైన్, రెండు సెల్ ఫోన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను శ్రీవారి పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మార్చి 14 న కూడా ఇలాంటి మోసానికే తెర తీశాడు. కోయంబత్తూరుకు చెందిన శరణ్యకు మాంగళ్య పూజ చేస్తానంటూ ఆమె వద్ద 80 గ్రాముల బంగారు కాజేసాడు మురుగన్. టీటీడీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి శరణ్యను మాంగళ్య పూజ ముగ్గులోకి దింపాడు. ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ చైను తీసుకుని పుష్కరిణిలో స్నానం చేసి మాంగళ్య పూజ కోసం ఆలయం వద్దకు రావాలన్నాడు మురుగన్. స్నానం చేసి శరణ్య అక్కడికి వచ్చేలోపు ఆలయం వద్ద పత్తా లేకుండా పోయాడు మురుగన్. ఇక మార్చి 18 న తిరువల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేసి ఆమె వద్ద ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసును తీసుకొని మాయమయ్యాడు. మార్చి 14, 29, ఏప్రిల్ 18 న ముగ్గురు మహిళలను మాంగళ్య పూజ పేరుతో మోసం చేసి 3 కేసుల్లో నిందితుడిగా ఉన్న మురుగన్‌ను అరెస్ట్ చేసిన పోలీసుకు రిమాండ్ కు తరలించారు. గత 35 ఏళ్లుగా ఇలాంటి నేరాలకే పాల్పడుతూ తరచూ జైలుకు వెళ్లి వస్తున్న మురుగన్ నేరచరిత్ర పై ఆరా తీసిన పోలీసులు జల్సాల కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మురుగన్‌పై ఏపీ, తమిళనాడులో సుమారు 20కి పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తేల్చారు. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #Booking